తెలంగాణలో స్వర్ణ యుగం..

63
- Advertisement -

బాలికల విద్యలో తెలంగాణ టాప్‌లో ఉందని, బాలికల విద్యలో తెలంగాణ రాష్ట్రం స్వర్ణయుగంగా మారిందన్నారు ఎమ్మెల్సీ కవిత . కొత్త విద్యాసంస్థల ఏర్పాటు,మౌలిక వసతుల కల్పనతో, ఉన్నత విద్యలో బాలికలు పెద్ద ఎత్తున చేరుతుండటం గర్వకారణమని తెలిపారు.

పీజీలో 72శాతం, డిగ్రీలో 52శాతం,గురుకులాలు,కేజీబీవీల్లో 69 శాతం మంది బాలికలు చేరడం అభినందనీయమన్నారు. బీఈడీ ఫస్టియర్‌లో 81 శాతం బాలికల అడ్మిషన్లతో, ఉన్నత విద్యలో బాలికల ఎన్‌రోల్‌మెంట్‌ రేషియోలో జాతీయ సగటును మించి తెలంగాణ ఫలితాలను సాధిస్తున్నదని వెల్లడించారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల కేటాయింపులో తెలంగాణ పట్ల పూర్తి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నా, వైద్య విద్యలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -