రాష్ట్రంలో అద్భుత ప్రగతి: కేటీఆర్

102
- Advertisement -

దేశంలోనే తెలంగాణ అన్నిరంగాల్లో ముందజంలో ఉందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌ రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో ఉన్న టీ-హబ్‌లో జరిగిన డిప్లొమాటిక్‌ ఔట్‌రిచ్‌ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…తెలంగాణ ప్రభుత్వం నీటిపారుదల‌, సంక్షేమ పథకాలకు పెద్దఎత్తున నిధులు కేటాయిందన్నారు. ఫార్మస్యూటికల్‌ హబ్‌, బయోసైన్స్‌ హబ్‌గా ఉందని చెప్పారు. ఏరోస్పేస్‌ రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిందని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే హెలికాప్టర్‌ విడిభాగాలు ఇక్కడే తయారవుతాయని వెల్లడించారు.

రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని…2014లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.5.6 లక్షల కోట్లుగా ఉండేదని, 2022 నాటికి అది రూ.11.55 లక్షల కోట్లకు చేరిందన్నారు. ప్రధానితో జరిగిన సమావేశంలో ఇదేవిషయం చెప్పానని వెల్లడించారు. వ్యవసాయ రంగం, ఐటీ, పారిశ్రామిక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ పాం సాగవుతున్నదని వెల్లడించారు.

గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా లాంటి కంపెనీలు అమెరికా తర్వాత తమ సెకండ్‌ బ్రాంచిని హైదరాబాద్‌లో ప్రారంభించాయని వెల్లడించారు.

- Advertisement -