వ్యవసాయం లాభసాటి కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రైతు బంధు నిధుల పంపిణీ కొనసాగుతుండగా ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు నిరంజన్ రెడ్డి. ఇవాళ రైతుబంధు నిధులు రూ.426.69 కోట్లు విడుదల చేశామని, 1,87,847 మంది రైతుల ఖాతాలలో నిధులు జమ అయ్యాయని చెప్పారు.
8 లక్షల 53 వేల 409.25 ఎకరాలకు నిధులు విడుదల చేశామన్నారు. ఇప్పటి వరకు మొత్తం 56 లక్షల 58 వేల 484 మంది రైతుల ఖాతాలలో రూ.4754.64 కోట్లు జమ అయ్యాయని, ప్రతి రైతుకు రైతుబంధు సాయం .. పదో విడత రైతుబంధును విజయవంతంగా పూర్తిచేస్తాం అన్నారు. కరోనా ఇబ్బందులున్నా రైతుబంధు నిధులు పంపిణీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు.
ప్రతి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వంద శాతం కొనుగోళ్లు చేపట్టిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. ప్రతి సారి రైతుబంధు పథకం నిధులు విడుదల చేసే ముందు, ప్రతి ఏటా ధాన్యం కొనుగోలు సమయంలో ప్రభుత్వం మీద బురదజల్లడం విపక్షాలు, ఒక సెక్షన్ మీడియా లక్ష్యంగా పెట్టుకున్నాయన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు అన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా అమలు చేస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి..