రాష్ట్రంలో రాగల 3 రోజులు భారీ వర్షాలు..

120
Weather Forecast

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచన మరియు హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం. నిన్నటి ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతం మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు తెలంగాణ మరియు పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టమునకు1.5 కిమీ నుండి 5.8 కిమీ వరకు వ్యాపించి ఎత్తుకి వెళ్ళే కొలది పశ్చిమ వైపుకి వంపు తిరిగి ఉన్నది. ఈ రోజు ద్రోణి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి సౌరాష్ట్ర వరకు సముద్ర మట్టానికి 3.1 కిమీ వరకు వ్యాపించి ఉన్నది.

వాతావరణ సూచన: ఈ రోజు రాష్ట్రంలోని చాలా ప్రదేశాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.. అలాగే రేపు,ఎల్లుండి కొన్ని ప్రదేశాలలో వర్షం వచ్చే అవకాశములు ఉన్నాయి.

వాతావరణహెచ్చరికలు: ఈ రోజు తెలంగాణాలోని ఉత్తర,పశ్చిమ జిల్లాలలో ఒకటి,రెండు ప్రదేశములలో భారీ వర్షాలు వచ్చే అవకాశములు వున్నాయి. అలాగే ఎల్లుండి ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఒకటి రెండు ప్రదేశాలలో భారీ వర్షాలు వచ్చే అవకాశం వుంది. మరియు రాగల 3 రోజులు ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి,రెండు ప్రదేశములలో చాలా జిల్లాలలో భారీ వర్షాలు వచ్చే అవకాశములు వున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.