- Advertisement -
ఒకవైపు చలి మరోవైపు వర్షంతో ప్రజలు వణికిపోతున్నారు. తెలంగాణలో శనివారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా వర్షం కురిసింది. నేడు (ఆదివారం) కుడా కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో 24 గంటల పాటు అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
విదర్భ తూర్పు ప్రాంతంలో 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకూ మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో తెలంగాణ సహా, కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. సోమవారం కూడా దక్షిణ తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు.
- Advertisement -