ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగుతున్న ఈఎస్‌ఎల్ నరసింహాన్ పదవి కాలం ముగిసిపోతుండడంతో ఆస్ధానంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కర్ణాటక విధాన పరిషత్ చైర్మన్ గా సేవలందిస్తున్న డీ హెచ్ శంకరమూర్తి తెలంగాణ గవర్నర్ గా నియమించనున్నట్లు సమాచారం. శంకరమూర్తి నియామకానికి ప్రధాని మోడీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. గత వారంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు శంకరమూర్తితో చర్చించి, ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. శంకరమూర్తి నియామకంపై మరో రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడవచ్చని సమాచారం. శంకరమూర్తి కర్ణాటక రాష్ట్రంలో మంత్రిగానూ…మరికొన్ని పదవుల్లోనూ బాధ్యతలు నిర్వహించారు.
2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నరసింహన్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఉమ్మడి గవర్నర్‌గా పాలన కొనసాగించారు. మరి కొన్నిరోజుల్లో ఆయన పదవి కాలం ముగిసిపోనుంది. మరోమారు ఆయనకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగిన కేంద్రం మాత్రం కొత్త గవర్నర్‌ను ఎంపిక వైపే మొగ్గుచూపింది. అయితే కొత్తగా వచ్చే గవర్నర్ నరసింహన్ లగా తెలుగురాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉంటారా లేక తెలంగాణరాష్ట్రానికి మాత్రమే బాధ్యతలు నిర్వహిస్తారా అనే దానిపై వివరణలేదు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గవర్నర్ నరసింహన్‌కు చాలా సత్ససంబంధాలు కల్గి ఉన్నాయి. తాజాగా రాజభవన్‌లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో సీఎం కేసీఆర్‌పై గవర్నర్ నరసింహన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంలో గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ….కేసీఆర్ విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని కితాబిచ్చారు. ఎంతో సమర్థవంతంగా పాలన నిర్వహిస్తున్నారని …. రాష్ట్రంలో రెండేన్నరళ్లుగా శాంతిభద్రతల విషయంలో ఢోకాలేదన్నారు. ప్రతి ఇంటికి మంచినీరు అందించాలన్న లక్ష్యంతో సర్కారు చేపట్టిన మిషన భగీరథ పథకం ఒక నీటి తొట్టిలాంటిందని గవర్నర్ ఈ సందర్భంగా అన్నారు.
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ని కూడా గవర్నర్ పొగడ్తలతో ముంచెత్తారు. ఇన్ఫర్మేషన టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని కేటీఆర్ నంబర్‌వనగా నిలిపారని కితాబిచ్చారు. ‘ధనిక, మేధావి వర్గాలకే ఐటీ పరిమితమైందన్న అభిప్రాయాలుండేవి. ప్రభుత్వ విధానాలతో ఐటీ సామాన్యుల దరికి చేరింది’ అని చెప్పారు. టీ-హబ్ అనేది ప్రపంచంలోనే ఒక గొప్ప అన్వేషణ అని కొనియాడారు.ఇటీవలే గవర్నర్ పుట్టినరోజు వేడుకల్లో కేటీఆర్ గవర్నర్‌కు పాదాభివాదనం చేసిన ఆయన మనల్నిపొందారు.
అయితే గవర్నర్ ఈ విధంగా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని,మంత్రులను వారిపాలనను అభినందించడాని కాంగ్రెస్ నాయకులు తప్పుబట్టారు. బహుశ గవర్నర్‌కి పదవి కాలం ముగియనుంది కాబ్బట్టి నరసింహన్ ఈ చొరవ తీసుకొని ఉంటారు.