‘నేత్ర’ సెన్సార్ పూర్తి…

79
nethra censor complete

రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై గోపీచరణ్‌, ఐశ్వర్య అడ్డాల‌ హీరో హీరోయిన్లుగా రెడ్డెం యాదకుమార్‌ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మిస్తోన్న చిత్రం ‘నేత్ర’. ఇటీవ‌ల ఉద‌య్ నాగ్ ర‌త‌న్ దాస్ సంగీతాన్ని స‌మ‌కూర్చిన ఈ చిత్ర ఆడియో శ్రోత‌ల‌ను విశేషంగా అలరిస్తోంది. సెన్సార్ పూర్తయిన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత పీరికట్ల రాము మాట్లాడుతూ…. ‘ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు, ట్రైల‌ర్స్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. యూనిట్ అంతా క‌లిసి రీసెంట్ గా ఫ‌స్ట్ కాపీ చూశాము. సినిమా ప‌ట్ల ఎంతో న‌మ్మ‌కంతో ఉన్నాం. దర్శకుడు చిత్రాన్ని చెప్పిన దానికంటే కూడా ఎంతో బాగా తెర‌కెక్కించాడు. ఆడియో సినిమా పై క్రేజ్ ని పెంచింది. సెన్సార్ పూర్త‌యింది. త్వ‌ర‌లో సినిమాను రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామన్నారు.

 nethra censor complete

చిత్ర దర్శకుడు రెడ్డెం యాదకుమార్‌ మాట్లాడుతూ… ‘ల‌వ్‌ అండ్‌ హర్రర్‌ కామెడీ ఎంటర్‌టైనర్ గా `నేత్ర‌` చిత్రం తెర‌కెక్కించాము. ఆడియన్స్‌కి కావాల్సిన ఆల్ కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉన్న చిత్ర‌మిది. హీరో గోపిచ‌ర‌ణ్‌, హీరోయిన్‌ ఐశ్వర్య బాగా నటించారు. కెమెరా పనితనం ఈ చిత్రానికి ప్లస్‌ అవుతుంది. మా నిర్మాతకు ఇదే తొలి సినిమా అయినా ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. అనుకున్న దానికంటే కూడా సినిమా చాలా బాగా వచ్చింది. స్టార్ మేక‌ర్ సత్యానంద్‌ కుమారుడు తొలిసారిగా మా చిత్రం ద్వారా ఎంట్రీ ఇస్తున్నారని తెలిపారు. ఉద‌య్ నాగ్ ర‌త‌న్ దాస్ స‌మ‌కూర్చిన పాట‌లు బాగున్నాయని…. ఫస్ట్ కాపీ చూసిన మా టీమ్ అంతా ఎంతో ఉత్సాహంగా విజయం కోసం ఎదురుచూస్తుందని తెలిపారు.

గోపిచరణ్‌, ఐశ్వర్య హీరో హీరోయిన్‌లుగా నటిస్తుండగా, స్టార్‌మేకర్‌ సత్యానంద్‌, ఐకె త్రినాధ్‌, ధీరేంద్ర ధీరు, బుగత సత్యనారాయణ, హేమ, రేణుక, రాఘవేంద్ర, ప్రియాంక, సునీల్‌ చరణ్‌, తిరుమల‌రెడ్డి, జబర్దస్త్‌ అప్పారావు, జనార్ధన్‌ తదిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఉదయ్‌నాగ్‌ రతన్‌దాస్‌, మాట‌లు: ప్రసాదుల‌ మధుబాబు, కెమెరా: ఎస్‌.వి. గోపాల్‌, ఎడిటింగ్‌: నర్సింగ్‌ రాధోడ్‌, కొరియోగ్రఫి: లుక్స్‌ రాజశేఖర్‌, బాల‌కృష్ణ, ఫైట్స్‌: బాజీరావు, నిర్మాత: పీరికట్ల రాము, కథ ` స్క్రీన్‌ప్లే ` దర్శకత్వం: రెడ్డెం యాదకుమార్

 nethra censor complete