తగ్గిన కంటైన్మెంట్‌ జోన్లు

217
kcr cm
- Advertisement -

తెలంగాణలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్ల సంఖ్యను తగ్గించింది ప్రభుత్వం. గతంలో 243 కంటైన్‌మెంట్ జోన్లు ఉండగా ఇప్పుడు 132కు సంఖ్యను కుదించారు. హైదరాబాద్ మినహా మిగిలిన చోట్ల కేసుల్లో తగ్గుదల ఉండగా ఈ నెల 28 వరకు 21 జిల్లాలు కరోనా ఫ్రీగా మారనున్నాయని తెలిపారు సీఎం కేసీఆర్.

వివిధ జిల్లాల్లో 62, హైదరాబాద్‌లో 70 వరకు ప్రస్తుతం కంటైన్మెంట్‌ జోన్లు నడుస్తున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. కొన్నిచోట్ల ఆ సర్వేపై వ్యతిరేకత వచ్చినా చాలావరకు సమాచారం సేకరించినట్లు అధికారులు తెలిపారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే అధికంగా 540 కరోనా కేసులు నమోదయ్యాయి. కేవలం కరోనా లక్షణాలుంటేనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వచ్చే వారు, ఇతరత్రా కరోనా అనుమానిత లక్షణాలున్న వారికే నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో కరోనా కేసుల సంఖ్య తగ్గింది.

- Advertisement -