విత్తనోత్పత్తిలో  కొత్త అధ్యాయం: మంత్రి నిరంజన్ రెడ్డి

450
niranjan reddy
- Advertisement -

నెదర్లాండ్స్‌లోని సీడ్ వ్యాలీ హాలాండ్‌ను సందర్శించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.  తెలంగాణలో అంతర్జాతీయ విత్తన సలహా మండలి ఏర్పాటుచేస్తామని..విత్తనోత్పత్తిలో ఇది కొత్త అధ్యాయం అన్నారు. యూరోపియన్ దేశాలకు విత్తన ఎగుమతుల విషయంలో మరింత ప్రోత్సాహం అందిస్తామని..-  కేసీఆర్ మార్గదర్శనంలో తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా ఎదిగిందన్నారు.

తెలంగాణ అంతర్జాతీయ విత్తన భాండాగారంగా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని …  వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలో కూరగాయల విత్తనోత్పత్తికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం రూ.4 లక్షల కోట్ల విలువ ఉన్న అంతర్జాతీయ విత్తన మార్కెట్ 2025 నాటికి రూ.6 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు.

అంతర్జాతీయ విత్తన మార్కెట్ లో  2017 సంవత్సరంలో 3.6 బిలియన్ డాలర్లు, 2018 లో 4.1 బిలియన్ డాలర్ల విలువ కలిగి ఉన్న భారత్  2024 సంవత్సరానికి 9.1 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది అన్నారు.   అంతర్జాతీయ విత్తన చట్టాలు, నిబందనలు మరియు ప్రమాణాలకు, భారత విత్తన చట్టాలు, విత్తన నాణ్యత, విత్తన పరీక్షలలో వ్యత్యాసం ఉందని.. దాని మూలంగా అంతర్జాతీయ విత్తన వాణిజ్యంలో భారత వాటా 2 శాతం కన్నా తక్కువ భాగస్వామ్యం ఉందన్నారు.

తెలంగాణ ప్రాంతం భౌగోళికంగా, పర్యావరణ రీత్యా ప్రపంచంలో విత్తన ఉత్పత్తికి అనుకూలమైన అతికొద్ది ప్రాంతాలలో ఒకటని…  తెలంగాణలో విత్తనోత్పత్తిని ప్రోత్సహించడం మూలంగా అంతర్జాతీయ విత్తన విపణిలో కీలకంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ లో ఏర్పాటు చేయబోతున్న విత్తన పార్క్ లో, అంతర్జాతీయ విత్తన సలహా మండలి, రైతులకు అంతర్జాతీయ విత్తన నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి తెలంగాణతో  అంతర్జాతీయ విత్తన సంబంధాలను మెరుగుపరచి  విత్తన ఎగుమతులను ప్రోత్సహిస్తాం అన్నారు.

తెలంగాణ ప్రస్తుతం దేశానికి అవసరమయిన విత్తనాలలో 60 శాతం సరఫరా చేస్తుందని… నైపుణ్యం కలిగిన రైతులు, అనుకూలమయిన వాతావరణం ఇక్కడ ఉన్నందున ఇప్పటికే 400 జాతీయ, అంతర్జాతీయ స్థాయి విత్తన కంపెనీలు, ప్రాసెసింగ్ ప్లాంట్లు ఇక్కడ ఉన్నాయని చెప్పారు. నాణ్యమైన విత్తనోత్పత్తికి మంచి అవకాశాలు ఉన్న నేపథ్యం లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి యూరప్ దేశాలతో పాటు, సౌత్-ఈస్ట్ ఆసియన్ దేశాలైన వియాత్నం, కంబోడియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్ దేశాలకు విత్తన ఎగుమతులను ప్రోస్థహించాలనే ఉద్యెశంతో అంతర్జాతీయ విత్తన సలహా మండలి ఏర్పాటుకు సన్నాహాలు  చేస్తున్నామని తెలిపారు.

జర్మనీ, నెదర్లాండ్స్ పర్యటనలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ అదికారులతో, విత్తన కంపెనీల ప్రతినిధులు, విత్తన ఉత్పత్తిదారులతో తెలంగాణ లో ఏర్పాటు చేయబోతున్న అంతర్జాతీయ విత్తన సలహా మండలి గురించి చర్చించారు నిరంజన్ రెడ్డి.

- Advertisement -