9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

9
- Advertisement -

ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది ప్రభుత్వం. పాత తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ తల్లి జరీ అంచు పట్టు చీర ధరించగా.. కొత్త విగ్రహంలో పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీర ధరించి ఉంది. పాత విగ్రహంలో తలకు కిరీటం, చేతిలో బతుకమ్మ ఉండగా.. కొత్త విగ్రహంలో కిరీటం, చేతిలో బతుకమ్మ లేదు.

పాత విగ్రహంలో కుడి చేతిలో మక్క కంకులు ఉండగా.. కొత్త విగ్రహం కుడి చేతిలో అభయ హస్తం కనిపిస్తోంది. పాత విగ్రహంలో ఎడమ చేతిలో బతుకమ్మ ఉండగా.. కొత్త విగ్రహంలో ఎడమ చేతిలో వరి, జొన్న, సజ్జ కంకులు ఉన్నాయి. రెండు విగ్రహాల రూపాలకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది.

ఇటీవల తెలంగాణ గేయం విషయంలోనూ వివాదం నెలకొన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పాత గేయం స్థానంలో కొత్త గేయాన్ని తీసుకొచ్చింది. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం గత రూపాన్ని మారుస్తూ ఓ సాధారణ మహిళ రూపాన్ని తలపించేలా కొత్త రూపాన్ని రూపొందించింది.

Also Read:అల్సర్ ఉందా.. అల్లంతో జాగ్రత్త!

- Advertisement -