- Advertisement -
రూ.5.77 కోట్లతో ప్రతి జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 9న ఈ విగ్రహాలను ఆవిష్కరించాలని నిర్ణయించారు సీఎం రేవంత్.
ఒక్కో విగ్రహానికి రూ.17.5 లక్షలు దాకా ఖర్చు కాగా రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 12 అడుగుల ఎత్తులో ఈ ప్రతిమలను ఏర్పాటు చేయాలని, ఒక్కో విగ్రహ ఏర్చాటుకు దాదాపు రూ.17.5 లక్షల వరకు ఖర్చు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం.
33 జిల్లాలకు కలిపి సుమారు రూ.5.77 కోట్లు అవుతుందని అంచనా.
Also Read:కుబేర..4 రోజుల వసూళ్లెంతో తెలుసా?
- Advertisement -

