జర్మనీలో కార్వాన్‌ యువకుడి దుర్మరణం..

264
vinay kumar
- Advertisement -

ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లిన యువకుడు పది రోజుల కిత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇప్పటి వరకు మృతదేహం స్వదేశానికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కార్వాన్‌ సబ్జిమండికి చెందిన కట్టా వినయ్‌ కుమార్‌ (27) మాస్టర్స్‌ చదివేందుకు 2016లో జర్మనీ వెళ్లాడు. ఈనెల 3న అతను ఉండే బహుళ అంతస్తుల భవనంపై నుంచి పడి మృతి చెందినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది.

రెండేళ్ల క్రితం భారత్‌కు వచ్చి వెళ్లిన అతను గత నెలలో మళ్లీ రావాల్సింది. కరోనా నేపథ్యంలో రాలేకపోయాడని, ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లాడంటూ తల్లిదండ్రులు, బంధుమిత్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కుమారుడు మృతి చెంది ఇప్పటికే పది రోజులు దాటిందని, మరింత ఆలస్యం కాకుండా మృతదేహాన్ని ఇప్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు వినతిపత్రాలు అందించినట్లు పేర్కొన్నారు.

- Advertisement -