ట్విటర్‌పై కేంద్రం ఆగ్రహం..

184
Twitter
- Advertisement -

కొత్త ఐటీ నిబంధనలు పాటించకపోవడంపై ట్విటర్‌పై మరోసారి కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం ప్రభుత్వం కొత్త ప్రవేశపెట్టిన ఐటీ నిబంధనల అమలుపై మరోసారి ట్విటర్‌కు సామన్లు అందాయి. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఈనెల 18న హాజరుకావాలని ట్విటర్‌కు పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ నోటీసులు జారీ చేసింది. పదే పదే నోటిసులిచ్చినా తగిన వివరణ ఇవ్వడంలో ట్విటర్‌ విఫలమైందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మీటీవై) లోని సైబర్ లా గ్రూప్ కోఆర్డినేటర్ రాకేశ్ మహేశ్వరి ట్విటర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ వార్తలను దుర్వినియోగంపై కమిటీ తాజా నోటీసులిచ్చింది. జూన్ 18, శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పార్లమెంటు కాంప్లెక్స్‌లోని ప్యానెల్ ముందు హాజరు కావాలని తెలిపింది. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతతో పాటు, ఫేక్‌న్యూస్‌ నివారణపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో, మహిళల భద్రతకు రక్షణ కల్పించే అంశంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

కొత్త ఐటీ నిబంధనలను తక్షణమే అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ట్విటర్‌కు కొన్నాళ్ల క్రితం తుది నోటీసులు ఇచ్చింది. వీటిని అమలు చేయకపోతే ఐటీ చట్టం కింద లభించే మినహాయింపులను కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. నిబంధనల అమలులో ట్విటర్‌ వ్యవహారం సరిగ్గా లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీశాఖ వ్యాఖ్యానించింది. గడువు ఇచ్చినప్పటికీ.. నిబంధనలను పాటించడంలో అలసత్వం వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీంతో ట్విటర్‌ స్పందించింది. ‘‘భారత్‌ చట్టాల అమలుకు ట్విటర్‌ కట్టుబడి ఉంది. ప్రభుత్వం చెప్పిన నిబంధనలు అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తాం. ఈ క్రమంలో పురోగతని సమయానికి తెలియజేస్తాం. భారత ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు జరుపుతాం’’ అని ట్విటర్‌ పేర్కొంది.

కొత్త నిబంధనల కింద ఆయా సంస్థలు చీఫ్‌ కాంప్లియన్స్‌ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉండగా.. ట్విటర్‌ ఇంకా దానిపై నిర్ణయం తీసుకోలేదు. అంతేగాక, రూల్స్‌ ప్రకారం.. రెసిడెంట్ గ్రీవెన్స్‌ ఆఫీస్‌, నోడల్‌ కాంటాక్ట్‌ అధికారులను భారత్‌కు చెందిన వ్యక్తులను నియమించకపోవడంతో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినా వీటిని పాటించేందుకు విముఖత చూపిస్తోందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తుది హెచ్చరిక జారీ చేసింది.

- Advertisement -