వాయు కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి పీ.సత్యనారాయణరెడ్డి హెచ్చరించారు. బుదవారం నాచారం, మల్లాపూర్‌లోని పారిశ్రమికవాడలో ఇంటోనేషన్ రీసెర్చ్ ల్యాబ్, క్లీయర్ సింత్, శ్రీని ల్యాబ్స్, జీఆర్‌కే ల్యాబ్స్, వాగ్దేవి ల్యాబ్స్, జీవీకే బయో మల్లాపుర్, జీవీకే బయో నాచారం మరియు ఇన్నోజెంట్ ల్యాబ్స్ పరిశ్రమలను మండలి అధికారులు తనిఖీ చేశారు. ఇందులో జీవీకే బయో మరియు ఇన్నోజెంట్ ల్యాబ్స్ పరిశ్రమలను మండలి సభ్య కార్యదర్శి పి.సత్యనారాయణరెడ్డి స్వయంగా సందర్శించి అక్కడి వాయు కాల్యుష్య నియంత్రణ పరికరాల పనితీరును పరిశీలించారు.
నాచరం చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఫార్మా కంపెనీల నుండి వచ్చే వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్, సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు అందిన నేపథ్యంలో తంతేకాకుండా రాష్ట్ర కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు ఫిర్యాదులు అందినందుకు తనిఖీలు చేపట్టినట్లు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి తెలిపారు.
నాచారం, మల్లాపూర్ ప్రాంతాలలో వాయు కాలుష్యంపై అందుతున్న ఫిర్యాదులను దృష్ఠిలో పెట్టుకొని కాలుష్య నియంత్రణ మండలి తరపున మండలి నుండి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మరియు సైంటీస్ట్స్‌లతో కూడిన ఏడు టీమ్స్ లను ఏర్పాటు చేసి పరిశ్రమలతో పాటు చుట్టు పక్కల నివాస ప్రాంతాల్లో వాయు సాంపిల్స్‌ను సేకరించి ఎనాలిసిస్ చేయడం జరుగుతుందని సభ్య కార్యదర్శి తెలియజేశారు.
అంతే కాకుండా మండలి తరపున మొబైల్ ల్యబరేటరీ ద్వారా కూడా సాంపిల్స్ సేకరించి ఎనాలిసిస్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. తనిఖీ నివేదికలు, ఎనాలిసిస్ నివేదికల ఆధారంగా మండలి నిబంధనలను ఉల్లంఘించిన పరిశ్రమలను టాస్క్‌ఫోర్స్ కమిటీ ముందు హియరింగ్‌కు పిలిచి తదుపి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు తనిఖీలు ముమ్మరం చేస్తామని సభ్య కార్యదర్శి హెచ్చరించారు.