లండన్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు..

253
Telangana State Formation Day Celebrations
- Advertisement -

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లండన్ లోని హౌంస్లో లో టాక్ వెల్ఫేర్ ఇంచార్జ్ రవి కుమార్ రేటినేని అధ్యక్షతన జరిగిన ఈ వేడుకను కార్యవర్గ సభ్యులంతా కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ చిత్ర పటానికి పూలతో నివాళుర్పించి, అమరవీరులని స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు.

Telangana State Formation Day Celebrations

టాక్ వ్యవస్థాపకుడు మరియు ఎన్నారై టి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలందరికి రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు తెలుపుతూ….. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బాగస్వాములైనందుకు గర్వంగా వుందనీ, అలాగే రాష్ట్ర ఏర్పాటును కూడా చూసే అదృష్టం కలిగినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టమని, బంగారు తెలంగాణ కేవలం కేసీఆర్ వల్లే సాధ్యమని, ఎలాగైతే ఉద్యమంలో వారి వెంట ఉన్నామో, బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా వారి వెంట ఉండి మా వంతు బాధ్యత నిర్వహిస్తామని తెలిపారు.

Telangana State Formation Day Celebrations

టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ.. టాక్ ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, మేమంతా కేవలం నేడు సంబరాలకు పరిమితం కాకుండా, నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని, ఉద్యమ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు. సేవే లక్ష్యం – బంగారు తెలంగాణే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న మేము, తెలంగాణ సమాజానికి మా వంతు బాధ్యతగా సేవ చేస్తామని, బంగారు తెలంగాణలో బాగస్వాములమవుతామని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యవర్గ సభ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు.

Telangana State Formation Day Celebrations

ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం మరియు ఇతర ప్రతినిధులు మాట్లాడుతూ.. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణని, బంగారు తెలంగాణగా నిర్మించుకునే బాధ్యత అందరి పైన ఉందని ప్రతి ఒక్కరు వారి శక్తికి తగ్గట్టుగా బాగస్వాములవ్వాలని కోరారు. టాక్ ముఖ్య నాయకులు మట్టా రెడ్డి వందన సమర్పణతో కార్యక్రమం ముగించారు.

Telangana State Formation Day Celebrations

ఈ కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, అధ్యక్షురాలు పవిత్ర కంది,ఉపాధ్యక్షురాలు స్వాతి బుడగం,ప్రధాన కార్యదర్శి విక్రమ్ రెడ్డి రేకుల,అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్ మట్టా రెడ్డి, సభ్యులు వెంకట్ రెడ్డి దొంతుల,సంయుక్త కార్యదర్శులు నవీన్ రెడ్డి,శ్రీకాంత్ జెల్ల,ఈవెంట్స్ ఇంచార్జ్ అశోక్ దూసరి,రత్నాకర్ కడుదుల మరియు కార్యవర్గ సభ్యులు రవి కుమార్ రేటినేని ,మధుసూదన్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ వీర,సత్యపాల్ పింగిళి,సత్య చిలుముల, సత్యం కంది,మల్లా రెడ్డి,సతీష్ గొట్టిముక్కుల,రవి ప్రదీప్ పులుసు,రంజిత్ చాతరాజు,రాకేష్ పటేల్,వెంకీ సుదిరెడ్డి మరియు మహిళా విభాగం సభ్యులు సుప్రజ పులుసు, క్రాంతి రేటినేని, శ్రీ శ్రావ్య వందనపు,,శ్రీ లక్ష్మి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

- Advertisement -