తెలంగాణలో పది పరీక్షల షెడ్యూల్‌ విడుదల..

265
SSC Time Table 2020
- Advertisement -

హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. కొవిడ్‌-19 నిబంధనలకు లోబడి జూన్‌ 8వ తేదీ నుంచి జులై 5వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న 2,530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

ఇందుకోసం అదనంగా 26,422 మంది ప్రభుత్వ సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు. పది పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల మధ్య నిర్వహించనున్నారు. ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండేలా నిర్వహించనున్నారు.

జూన్‌ 8న ఇంగ్లీష్‌ మొదటి పేపర్‌
జూన్‌ 11న ఇంగ్లీష్‌ రెండో పేపర్‌
జూన్‌ 14న గణితము మొదటి పేపర్‌
జూన్‌ 17న గణితము రెండో పేపర్‌
జూన్‌ 20న సైన్స్‌(భౌతిక శాస్త్రం) మొదటి పేపర్‌
జూన్‌ 23న సైన్స్‌(జీవశాస్త్రం) రెండో పేపర్‌
జూన్‌ 26న సోషల్‌ స్టడీస్‌ మొదటి పేపర్‌
జూన్‌ 29న సోషల్‌ స్టడీస్‌ రెండో పేపర్‌
జులై 2న ఓరియంటల్‌ మెయిన్‌ లాంగ్వేజ్‌ మొదటి పేపర్‌(సంస్కృతం మరియు అరబిక్‌)
జులై 5న ఒకేషనల్‌ కోర్సు(థియరీ)

- Advertisement -