ఎస్సెస్సీలో అమ్మాయిలదే పైచేయి

176
Telangana SSC Results 2017 Declared
- Advertisement -

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. సచివాలయంలో ఫలితాలను విడుదల చేసిన ఆయన జగిత్యాల జిల్లా 97.35 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్ధానంలో నిలిచిందని తెలిపారు. తర్వాతి స్ధానాల్లో 93.73 శాతంతో కరీంనగర్, 93.56 శాతంతో జనగామ,93.48 శాతంతో వరంగల్ అర్బన్ నిలవగా 64.81 శాతంతో వనపర్తి చివరి స్ధానంలో నిలిచిందని తెలిపారు.

మొత్తం 84 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని… 2005 పాఠశాలు వందశాతం ,28 పాఠశాలలు జీరో రిజల్ట్ సాధించాయని కడియం తెలిపారు. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్  95 శాతం ఉత్తీర్ణత సాధించగా ఓవరాల్‌గా అన్ని  రెసిడెన్షియల్ స్కూల్స్ మంచి ఫలితాలను సాధించాయని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే 1.4 ఉత్తీర్ణత శాతం తగ్గిందని … పరీక్షలు పకడ్బందీగా నిర్వహించామని కాపీయింగ్ కు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. సేఫ్టీతో పాటు సిట్టింగ్ స్క్వాడ్స్‌తో విద్యార్ధులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు.

జూన్ 5 నుంచి 19 వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ మే 18 అని తెలిపారు. మార్చి 12 నుంచి 30 తేదీ వరకు పరీక్షలు జరగాయని సుమారు 5.30 లక్షల మంది విద్యార్థులు రాశారని కడియం తెలిపారు. కొత్త జిల్లాల ప్రకారమే విద్యార్థుల ఉత్తీర్ణత శాతం, ఇతర వివరాలను వెల్లడించారు.

- Advertisement -