అశ్లీల చిత్రాలు పోస్ట్‌ చేసిన ఎమ్మెల్సీ..!

202
Karnataka MLC posts porn photos on WhatsApp group, exits after
- Advertisement -

ఆయనో ప్రజాప్రతినిధి.. అయితేనేం, తనలో లేకిబుద్ధులు ఏమాత్రం పోలేదని నిరూపించుకున్నాడు. అశ్లీల చిత్రాలను వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వ్యవహారం దేశం మొత్తం కలకలం సృష్టిస్తుంది.  కర్ణాటకలోని బెల్గావి పట్టణానికి చెందిన బీజేపీ ఎమ్మెల్సీ మహన్ తేష్ కవతగిమాత్ కేఎల్ఈ సొసైటీ పేరిట పలు విద్యాసంస్థలు, ఆర్థిక సంస్థలు నిర్వహిస్తున్నారు.

ఇటీవల మహన్ తేష్ బెల్గావి మీడియా ఫోర్స్ వాట్సాప్ గ్రూపులో సీనియర్ రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు, జర్నలిస్ట్‌లకు చెందిన 50 వరకు అశ్లీల చిత్రాలను తీవ్ర వ్యాఖ్యలతో పోస్ట్ చేసి సంచలనం సృష్టించారు. అయితే ఈ విషయం మీడియాలో ప్రసారం కావడంతో కంగుతిన్న ఎమ్మెల్సీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినట్లు అక్కడి మీడియా కోడై కూస్తుంది. అయితే దీనిపై స్పందించిన వాట్సప్ గ్రూప్ నిర్వహాకుడు మకందర్ తమ వాట్సాప్ గ్రూప్ నుంచి ఎమ్మెల్సీ పెట్టిన అశ్లీల చిత్రాలను వెంటనే తొలగించామని చెప్పారు.
 Karnataka MLC posts porn photos on WhatsApp group, exits after
ఓ ప్రజాప్రతినిధే ఇటువంటి చిత్రాలను పోస్ట్ చేశారంటే ఇందులో ఏదో ఉండే ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అయితే..బాధ్యాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్సీ ఇలాంటివి షేర్ చేయడం కరెక్ట్ కాదని, సత్వరమే పార్టీ అధిష్టానం చర్యలు తీసుకొని శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ పోస్టు చేసిన అశ్లీల చిత్రాల వ్యవహారం కర్ణాటకలో కలకలం రేపుతోంది.

- Advertisement -