టీఎస్‌ ‘పది’ విద్యార్థులకు గ్రేడ్లు ఖరారు

708
telangana ssc exams
- Advertisement -

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు ఖరారయ్యాయి. www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మెమోలు తమ పాఠశాలలో తీసుకోవాలని సూచించారు. పొరపాట్లు ఉంటే పాఠశాల ద్వారా ఎస్‌ఎస్‌సీ బోర్డుకు తెలియజేయాలన్నారు.

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇంటర్నల్‌, అసెస్‌మెంట్‌ మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ ఇచ్చింది ప్రభుత్వం.

- Advertisement -