అనుష్క డైరెక్టర్‌తో హన్సిక వెబ్ సిరీస్‌..!

320
Hansika Motwani
- Advertisement -

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలు డిజిటల్‌ ఫ్లాట్‌ఫం వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. నిర్మాతలు,దర్శకులు,హీరోలు,హీరోయిన్స్‌ తమ సినిమాలను ఓటీటీల ద్వారా విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు. అమెజాన్ ప్రైమ్ నెట్ ఫ్లిక్స్ ఆహా లాంటి ఓటీటీల రాకతో వెబ్ సిరీస్ లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. కథ స్క్రీన్ ప్లే బాగుంటే కోట్లలో బిజినెస్ నడుస్తుండటంతో అందరూ కూడా ఓటీటీలపై ప్రధానంగా దృష్టి పెట్టారు.

తాజాగా అందాలతార హన్సిక కూడా డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశిస్తోంది. తొలిసారిగా ఈ ముద్దుగుమ్మ వెబ్ సీరీస్‌లో నటించనుంది. ‘భాగమతి’ ఫేం అశోక్ దర్శకత్వంలో రూపొందే ఓ వెబ్ సీరీస్‌లో హన్సిక నటించనుంది. దైనందిన జీవితంలో మన సమాజంలో మహిళలు ఎదుర్కునే కష్టాలు, సమస్యలపై ఇది రూపొందుతుంది. మరి ఈ అమ్మడు వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.

- Advertisement -