అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై స్పీకర్ సమీక్ష..

439
Telangana Speaker
- Advertisement -

ఈనెల 6 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ హాల్ లో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆధ్వర్యంలో మండలి చైర్మన్, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, చీఫ్ విప్,విప్ లు,సీఎస్ సోమేశ్ కుమార్,ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రామకృష్ణ రావు,జిఎడి ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ మహేందర్ రెడ్డి,హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్,రాచకొండ సిపి మహేష్ భగవత్ పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. రాష్ట్ర శాసనసభ సజావుగా జరగడానికి సభ్యులు, అధికారుల మధ్య ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ పోలీసు శాఖ సమర్ధవంతమైన పనితీరుతో గత సమావేశాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా జరిగాయన్నారు.రాష్ట్ర శాసనసభ జరిగే తీరు దేశంలోనే ఆదర్శంగా ఉండాలి. రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడే విధంగా, ప్రజల ప్రయోజనాలు కోసం జరుగుతున్న శాసనసభ సమావేశాలను ప్రజలు గమనిస్తుంటారు. ఈ సమావేశాలు కూడా సజావుగా జరగడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ తెలిపారు.

- Advertisement -