తెలంగాణ చిత్రసీమలో ‘సింహా’ అవార్డులు

232
online news portal
- Advertisement -

సినీ అవార్డుల్లో తెలంగాణ ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం.. నంది అవార్డును కూడా మార్చేయాలని నిర్ణయించింది. నంది స్థానంలో సింహ పేరిట అవార్డులు ఇవ్వనుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇకపై ఉత్తమ చిత్రాలకు సింహ అవార్డులు ఇవ్వనుంది. దీనిపై అవార్డుల కమిటీ చేసిన సిఫారసులకు ఆమోద ముద్రవేశారు సీఎం కేసీఆర్‌. యాదాద్రి లక్ష్మీనరసింహుడి పేరుతో ఈ అవార్డులు ఇవ్వనున్నారు.

online news portal

ఉత్తమంగా ఎంపిక చేసిన చిత్రానికి బంగారు సింహ అవార్డు కింద జ్ఞాపిక, రూ.5 లక్షలు నగదు, ద్వితీయ ఉత్తమ చిత్రానికి రజత సింహంతోపాటు రూ.3 లక్షలు, తృతీయ ఉత్తమ చిత్రానికి తామ్ర సింహంతోపాటు రూ.2 లక్షల నగదు ఇస్తారు. కనీసం 20 శాతానికి మించి తెలంగాణ రాష్ట్రంలో చిత్రీకరించిన చలన చిత్రాలను మాత్రమే అవార్డు ఎంపికకు పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఏటా మార్చి-ఏప్రిల్‌ నెలల్లో తెలంగాణ ప్రభుత్వం సింహ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ సినీ ప్రముఖులు పైడి జయరాజు, కత్తి కాంతారావు, ప్రభాకర్‌ రెడ్డి, దాశరథి కృష్ణమాచార్య, సంగీత దర్శకుడు చక్రి పేరిట అవార్డులు ఇవ్వనున్నట్టు ఇది వరకే ప్రకటించారు.

- Advertisement -