తెలంగాణ బీజేపీలో గత కొన్నాళ్లుగా అంతర్మధనం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పార్టీలోని కీలక నేతలపై ఇతర నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఫలితంగా అంతర్గత విభేదాలు, అసమ్మతి సెగలు పెరుగుతూ వచ్చాయి. పార్టీ అగ్రనాయకత్వం ఇటీవల తెలంగాణపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అధినాయకులు చోరువ తీసుకున్నప్పటికి పార్టీలోని లొసుగులు ఏమాత్రం తగ్గడంలేదు. మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీని గాడిన పెట్టేందుకు అగ్రనేతలు ప్రయత్నిస్తుంటే.. అసంతృప్తిలో ఉన్నకొంతమంది నేతలు పార్టీని విడేందుకు సిద్దమౌతున్నారు. గత కొన్నాళ్లుగా విజయశాంతి,వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి వంటి వారు పార్టీ వీడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి..
అయితే వీరు మాత్రం ఆ వార్తలలను తరచూ ఖండిస్తూనే ఉన్నారు. కాగా ఈ మద్య వీరంతా కూడా తరచూ భేటీ అవుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మద్య వివేక్ ఇంట్లో భేటీ అయిన వీరు.. ఆ తరువాత విజయశాంతి ఇంట్లో కూడా మరోసారి సమావేశం అయ్యారు. మరి పార్టీ వీడకపోతే వీరంతా ఎందుకు సమావేశం అవుతున్నట్టు అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. పార్టీ ఆగ్ర నేతలు కూడా వీరిపై ప్రత్యేక దృష్టి సరిస్తున్నారు. ఏక్షణంలోనైనా వీరు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని ఆగ్రనాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ వీరంతా కూడా నిజంగానే బిజెపి విడితే గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. అసలే అభ్యర్థుల కొరత తీవ్రంగా వేదిస్తున్న కమలం పార్టీలో ఉన్న నేతలు కూడా జారిపోతే బీజేపీ పనైపోయినట్లే అనే వాదన వినిపిస్తోంది. కాగా అభ్యర్థుల విషయంలో ఇప్పటికీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎంపికపై ఇంకా కసరత్తులు జరుగుతూనే ఉన్నాయి. అయితే మొదటి జాబితా సీట్ల ప్రకటన జరిగిన తరువాత ఆశించిన వారికి సీట్లు దక్కని పక్షంలో వీరంతా కూడా కచ్చితంగా జంప్ అవుతారనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి కాషాయపార్టీలో ఎన్నికల ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
Also Read:ఆకలి వేయట్లేదా.. ఇలా చేయండి !