దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ: తమిళి సై

21
tamilisai

తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందన్నారు గవర్నర్ తమిళి సై. గవర్నర్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన విధుల నిర్వహణ, అనుభవాలపై పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన తమిళి సై.. గ‌వ‌ర్న‌ర్‌గా రెండేళ్లు పూర్తి చేసుకోవ‌డం సంతోషంగా ఉందన్నారు.

త‌నకు స‌హ‌క‌రించిన‌ తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు, రాష్ట్ర ప్ర‌భుత్వానికి ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపారు. ఇత‌ర రాష్ట్రాల‌తో పోల్చితే తెలంగాణ‌లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా కొన‌సాగుతోంద‌ని ..పేద ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో మెరుగైన వైద్య సేవ‌లు అందుతున్నాయ‌ని పేర్కొన్నారు.

వ్యాధులు, వ‌ర‌ద‌లు సంభ‌వించిన‌ప్పుడు ప్ర‌భుత్వ యంత్రాంగం ప‌నితీరు బాగుంద‌ని ప్ర‌శంసించారు. మొబైల్ టెస్టింగ్‌ల ద్వారా కొవిడ్ టెస్టులు నిర్వ‌హించ‌డం మంచి నిర్ణ‌యం అన్నారు. సీఎం కేసీఆర్‌తో స‌త్సంబంధాలు ఉన్నాయని …పుదుచ్చేరికి పీపీఈ కిట్లు, మాస్కులు అంద‌జేసిన తెలంగాణ ప్ర‌భుత్వానికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.