భారీ వర్షాలు..సచివాలయ ఉద్యోగుల విరాళం

9
- Advertisement -

భారీ వర్షాలతో తెలంగాణలో భారీ నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు సీఎంఆర్‌ఎఫ్‌కు పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక రోజు వేతనం రూ.100 కోట్లు ఇస్తున్నట్లు తెలపగా తాజాగా సచివాలయ ఉద్యోగులు ముందుకు వచ్చారు.

ఒక రోజు మూల వేతనం సీఎం సహాయ నిధికి ఇస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని వారిని ఆదుకునేందుకు సచివాలయ ఉద్యోగులుగా మా సామాజిక బాధ్యతతో ఒక రోజు విరాళాన్ని ఇస్తున్నట్లు తెలిపారు.

సీఎం సహాయనిధికి రూ. 70 లక్షల మూల వేతనం సీఎంఆర్‌ఎఫ్‌కు ఇవ్వాలని ఉద్యోగులందరం కలిసి నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

Also Read:చివరి నిమిషంలో వస్తే ఎలా..గణేష్ నిమజ్జనంపై హైకోర్టు

- Advertisement -