రాష్ట్ర గిరిజన ఆర్థిక సహకార సంస్థ చైర్మన్‌గా రామచందర్‌ నాయక్‌

95
ramchandar
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర గిరిజన ఆర్థిక సహకార సంస్థ చైర్మన్‌గా ఇస్లావత్‌ రామచందర్‌ నాయక్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియమించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ రామ‌చంద‌ర్ నాయ‌క్‌కు నియామ‌క ప‌త్రాన్ని అంద‌జేసి, అభినందించారు. ఈ ప‌దవిలో రామ‌చంద‌ర్ నాయ‌క్ రెండేండ్ల పాటు కొన‌సాగ‌నున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్‌, నోముల భగత్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు పాల్గొన్నారు.


నల్గొండ జిల్లా త్రిపురారం మండలానికి చెందిన రామచందర్‌నాయక్‌ ఎంపీపీగా, జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన నల్గొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నల్గొండ జిల్లా రాజకీయాల్లో పలు పదవులను నిర్వహించారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం, టీఆర్‌ఎస్‌ పార్టీలో కీలకంగా వ్యవహరించటంతోపాటు టీఆర్‌ఎస్‌ ఎస్టీ సెల్‌లో సుదీర్ఘకాలం పనిచేశారు.

- Advertisement -