తెలంగాణ రైతుల కోసం అమలు చేస్తున్న రైతుబంధు పథకం ఇక నిలిచిపోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా క్యాబినెట్ సమావేశంలో రైతుబంధు అంశం ప్రస్తావనకు రాకపోవడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావరు ఈ సమావేశానికి హాజరుకాకపోవడం మరింత సందేహాలకు తావిచ్చింది.
డిసెంబర్‌లో ఇవ్వాల్సిన రైతుబంధు సాయం ఆలస్యమవుతుండటంపై ఇప్పటికే రైతుల్లో ఆందోళన ఉంది. ఫిబ్రవరి 4న మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుబంధు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా, ఫిబ్రవరి 5 నాట్ల పంటల పనులు పూర్తయ్యేలోపు డబ్బులు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా హామీ ఇచ్చారు.
ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి. పొలాల్లో నాట్లు వేయడం కూడా ముగిసింది. అయినప్పటికీ తాజా క్యాబినెట్ సమావేశంలో రైతుబంధు గురించి ఎలాంటి నిర్ణయం లేకపోవడం రైతుల్లో నిరాశ కలిగిస్తోంది. ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇవ్వకపోతే రైతుల ఆందోళనలు మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రైతుబంధు భవితవ్యంపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read;బెంగాల్ ఓటర్లకు ప్రధాని భావోద్వేగ లేఖ

