మార్చి 2న తెలంగాణకు రానున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పార్టీ నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు ఆయన హాజరై నేతలకు మార్గదర్శనం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు హాజరుకానున్నారు.
పార్టీ బలోపేతం, కేడర్ నిర్మాణం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత వ్యవస్థను బలపరచడం వంటి అంశాలపై రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చించనున్నారు.
ప్రత్యేకంగా యువ నాయకత్వానికి అవకాశాలు కల్పించడం, ప్రజా సమస్యలపై సమర్థంగా స్పందించడం, సోషల్ మీడియా వినియోగం వంటి అంశాలపై సూచనలు ఇవ్వనున్నారు. ఈ సమావేశం ద్వారా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read:బెంగాల్ ఓటర్లకు ప్రధాని భావోద్వేగ లేఖ

