దావోస్‌ వేదికగా తెలంగాణ రైజింగ్‌ 2047

6
- Advertisement -

దావోస్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను గ్లోబల్ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) వార్షిక సమావేశాల్లో తెలంగాణ ప్రత్యేక పావిలియన్‌తో పాల్గొననుంది. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే CURE, PURE, RARE ఫ్రేమ్‌వర్క్‌పై ఈసారి ప్రత్యేక దృష్టి సారించనుంది.

CURE ద్వారా క్లైమేట్ యాక్షన్, అర్బన్ ఇన్నోవేషన్, రిన్యూవబుల్ ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం. PURE ఫ్రేమ్‌వర్క్‌లో ప్రజల జీవన ప్రమాణాలు, పట్టణ–గ్రామ సమతుల్య అభివృద్ధి, హ్యూమన్ క్యాపిటల్‌పై ఫోకస్ ఉంటుంది. RARE ద్వారా రీజనల్ అడ్వాంటేజ్, రీసెర్చ్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, ఎంట్రప్రెన్యూర్షిప్‌ను ప్రోత్సహించనున్నారు.

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో గ్లోబల్ ఇన్వెస్టర్లకు ముఖ్యమంత్రి బలమైన పిచ్ ఇవ్వనున్నారు. అలాగే గత రెండు దావోస్ పర్యటనల్లో కుదిరిన పెట్టుబడుల అమలుపై సీఎం సమగ్రంగా సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న పెట్టుబడి ప్రతిపాదనలను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని, సంబంధిత శాఖలు నిరంతరం ఫాలోఅప్ చేయాలని అధికారులకు ఆదేశించారు.

దావోస్ వేదికగా జరిగే ఈ చర్చలు తెలంగాణకు కొత్త పెట్టుబడులు, భాగస్వామ్యాలకు బాటలు వేస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Also Read:మద్యం సీసాలపై కూటమి తప్పుడు ప్రచారం!

- Advertisement -