రాష్ట్రంలో కొత్తగా 3,982 పాజిటివ్ కేసులు..

141
- Advertisement -

తెలంగాణలో కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో 71,616 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 5,186 మంది కరోనా నుంచి కోలుకోగా, 27 మంది మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు 5,36,766 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 4,85,644 మంది కోలుకున్నారు. ఇంకా 48,110 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మృతుల సంఖ్య 3,012కి చేరింది.

జీహెచ్ఎంసీ పరిధిలో 607 కొత్త కేసులు వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాలో 262, ఖమ్మం జిల్లాలో 247, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 225 కేసులు గుర్తించారు. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 18 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా రికవరీ రేటు మరింత పెరిగింది. ప్రస్తుతం తెలంగాణ రికవరీ రేటు 90.47 శాతం కాగా, జాతీయస్థాయిలో అది 85.6 శాతంగా నమోదైంది. దేశంలో కరోనా మరణాల రేటు 1.1 శాతం కాగా, తెలంగాణలో 0.56 శాతంగా ఉంది.

- Advertisement -