తెలంగాణ‌లోని వైద్య విద్యార్థులకు స్టైపెండ్ పెంపు..

51
Stipend Of House Surgeon

తెలంగాణ‌లోని హౌస్‌ సర్జన్లు, పీజీ వైద్యులు, సూపర్‌ స్పెషాలిటీ విద్యార్థుల స్టైపెండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు స్టైఫండ్‌ పెంచుతూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ హౌస్ సర్జన్లు, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమో, ఎండీఎస్‌, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చదువుతున్న విద్యార్థి వైద్యులకు 2021 జనవరి ఒకటి నుంచి ప్రస్తుత స్టయిఫండ్ పై 15 శాతం పెంచుతున్నామని తెలిపింది.

మెడికల్, డెంటల్ హౌస్ సర్జన్లకు ఇకనుంచి నెలకు 22వేల527 రూపాయలు ఉపకార వేతనంగా లభించనుంది. పీజీ డిగ్రీ, పీజీ డిప్లమో, ఎండీఎస్‌ మొదటి సంవత్సరం వారికి నెలకు 50,686 రూపాయలు స్టయిఫండ్ ఇస్తారు. పీజీ డిగ్రీ, పీజీ డిప్లమో, ఎండీఎస్‌ రెండో ఏడాది వారికి 53,503 రూపాయలు రానుంది. పీజీ డిగ్రీ, ఎండీఎస్‌ మూడో ఏడాది వారికి 56,319 రూపాయలు స్టైఫండ్ గా చెల్లిస్తారు.