భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే.. నిద్రమత్తులో అధికార పార్టీ నేతలు ఉన్నారు. మరోవైపు ప్రజల మధ్యలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉండి అండగా నిలుస్తున్నారు. మెదక్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు పోంగి పొర్లి, తిమ్మాపూర్ గ్రామంలోని చెరువు కట్ట తెగడంతో ఒక్కసారిగా వరద నీరు గ్రామాన్ని, పరిసర పంట పొలాలను ముంచెత్తింది. నియోజకవర్గంలోని చాలా లోతట్టు గ్రామాలు, తాండాలలో ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తుంటే.. ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా కానరాలేదు.
మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ వెంటనే తిమ్మాపూర్ గ్రామానికి చేరుకొని వరదలలో చిక్కుకున్న గ్రామస్తులను కలిసి ధైర్యం చెప్పారు. ఆర్డీఓ, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే చెరువు కట్ట మరమ్మత్తులు చేయించాలని సూచించారు. ప్రజలు ఇంత గోస పడుతుంటే.. ఉదయం నుండి ఏ అధికారులు కానీ ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ ఎవ్వరూ రాలేదని, ప్రజల సమస్యలను అడిగే నాథుడు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:రేవంత్ దేవుడు కాదు..రాజాసింగ్ ఫైర్!

