రేవంత్ దేవుడు కాదు..రాజాసింగ్ ఫైర్!

14
- Advertisement -

రేవంత్ ఏం దేవుడు కాదు.. రేవంత్ రెడ్డి గెటప్‌లో ఉన్న వినాయకుడిపై రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే మండపాన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీకి లేఖ రాశారు.

గోషామహల్ నియోజకవర్గంలోని అఘాపూరలో సీఎం రేవంత్ రెడ్డి గెటప్‌లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్ .

సీఎంపై గౌరవంతో దాన్ని ఏర్పాటు చేసినా ఆయన తమకు దేవుడు కాదని.. ఇలాంటి చర్యలు హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీస్తాయని, మత విశ్వాసాలను గౌరవించాలని కోరారు రాజాసింగ్. హైదరాబాద్ – గోషామహల్ నియోజకవర్గం అఘాపూరలో రేవంత్ రెడ్డి గెటప్‌లో ఉన్న వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేశారు ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్.

Also Read:భారీ వర్షాలు.. అందుబాటులో ఉండండి:కేసీఆర్

- Advertisement -