రాష్ట్రంలో దంచికొడుతున్న వర్షాలు..

7
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. హైదరాబాద్‌ సహా 6జిల్లాలు భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 41-61 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఇవాళ (బుధవారం) ఉదయం నుంచి రేపటి (గురువారం) ఉదయం వరకు అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Also Read:జోషి దర్శకత్వంలో ఉన్ని ముకుందన్!

మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 9.1 సెంటీమీటర్లు, మంచిర్యాలీ జిల్లా నస్పూర్ లో 8.4 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లిలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

- Advertisement -