ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విద్యుత్ ఉద్యోగులు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రభాకర్‌రావుకు మద్దతుగా రాష్ట్రవ్యాప్త విద్యుత్ ఉద్యోగులు నేడు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు మింట్‌కాంపౌండ్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు.
రాజకీయ నాయకులు అధికారుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి.తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపిన ఘనత ప్రభాకర్ రావుకి దక్కిందని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు దీమా వ్యక్తం చేశారు. దీన్ని కొంత మంది జీర్ణం చేసుకోలేక పోతున్నారు.ఒక్కో ఇంజనీర్ 24 గంటలు పని చేస్తేనే 24 గంటల విద్యుత్ సాకారం అయింది.ఒక వేళ తప్పు చేస్తే దర్యాప్తు చేయడానికి అనేక సంస్థలు ఉన్నాయి. సీఎండీ ఏమైనా తప్పు చేస్తే ఆధారాలతో నిరూపించండి. మా మనోధైర్యన్ని దెబ్బతీసేలా వ్యవహరించకండి.పవర్‌తో పెట్టుకున్నవాళ్ళు ఎవరూ కూడా పవర్‌లో లేరని ఎద్దేవ చేశారు.
పార్లమెంట్ సభ్యుడు అయి ఉండి ఆన్ పార్లమెంట్ భాష మాట్లాడం నికే చెల్లుతుందని రేవంత్ రెడ్డిపై బగ్గుమన్నారు.నీలాంటి నీచ వ్యక్తులు పార్లమెంట్‌కు పోవడం దూరదుష్టకారం.ఉద్యోగులకు ఎం పని అంటున్నారు.. మా ఓట్లు ఎందుకు మరి. ఓట్ల కోసం కావాలి కానీ ప్రశ్నించడం వద్దా…!ఏమైనా ఆధారాలు ఉంటే మాతో చర్చకు వస్తాం అంటే మేము సిద్ధం.విద్యుత్ సౌధకు రాండి చర్చ పెట్టుకుందామని విద్యుత్ ఉద్యోగులు సవాల్ విసిరారు.మీ వద్ద ఏమైనా సమాచారం ఉంటే మాకు చెప్పండి నిజం అనిపిస్తే మా యాజమాన్యంను ప్రశ్నిస్తామన్నారు.
అనవసర ఆరోపణలు మానుకోండి లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి.విద్యుత్ ఉద్యోగులుగా విద్యుత్ సంస్థను కాపాడాల్సిన అవసరం మపై ఉంది.ఆంధ్ర ఉద్యోగులు ఇక్కడే ఉన్నారు వాటి గురించి మాట్లాడండి.కరెంట్ వాళ్ళతో పెట్టుకుంన్నోడు ఎవరు బాగుపడ్డ చరిత్ర లేదు.రాజకీయ నాయకులు మీకు చేతనైతే విద్యుత్ ఉద్యోగుల విభజన అంశంపై చర్చ పెట్టి తెలంగాణ ఉద్యోగులకు న్యాయం జరిగేలా చేయండి.రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటానని మీడియా ముఖంగా చెబితే మీ హుందా పెరుగుతది.రేవంత్ రెడ్డి మాటలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు తెలిపారు.