250 కోట్లకు మించి తీసుకున్న రుణాలను మానిటరింగ్ చేయడానికి ప్రత్యేక ఏజెన్సీలు ఏర్పాటు చేయబడ్డాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతామారన్ అన్నారు. ఇవాళ(ఆగస్టు-30,2019) ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. గ్రాస్ నాన్ ఫర్ఫార్మింగ్ అసెట్స్ 8.65 లక్షల కోట్ల నుంచి 7.90లక్షల కోట్లకు దిగి వచ్చాయన్నారు.బ్యాంకుల విలీనంపైనే నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు ప్రకటించారు. మొత్తం 10 ప్రభుత్వ బ్యాంకులను కేవలం నాలుగు బ్యాంకులుగా ఏర్పాటు విలీనం చేస్తూ నిర్ణయం తీసకున్నారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB),ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంకులు ఒక్కటి అవబోతున్నాయని, 17.95 లక్షల కోట్ల బిజినెస్ తో రెండవ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకుగా అవతరించనున్నట్లు ఆమె తెలిపారు. సిండికేట్ బ్యాంకు,కెనరా బ్యాంక్ విలీనం ద్వారా 15.20లక్షల కోట్ల బిజినెస్‌తో నాల్గవ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకుగా అవతరించబోతున్నట్లు ఆమె తెలిపారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు ఇకపై ఒకే బ్యాంకుగా అయ్యి ఐదవ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌గా ఇప్పుడు అవతరించినట్లు ఆమె తెలిపారు.అలహాబాద్ బ్యాంకు ఇండియన్ బ్యాంక్ విలీనం ద్వారా 8.08లక్షల కోట్లతో ఏడవ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌గా అవతరించబోతున్నట్లు ఆమె తెలిపారు.
9.3లక్షల కోట్ల వ్యాపారంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా, 4.68లక్షల కోట్ల వ్యాపార సైజ్ ఉండి జాతీయ ఉనికి కలిగి ఉండే ఈ రెండు బ్యాంకులతో కంటిన్యూ అవ్వాలని ఆమె తెలిపారు.ఇప్పటివరకు ఇండియాలో 27 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయని,ఇవాళ చేసిన ప్రకటనతో ఇకపై దేశంలో 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మాత్రమే ఉంటాయని ఆమె తెలిపారు.