తెలంగాణలో 5 గంటల వరకే పోలింగ్..

22
- Advertisement -

తెలంగాణ లో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ జరగనుంది. ఏపీ సహా మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుందని తెలిపింది ఈసీ. 5 గంటల వరకే పొలింగ్ ఉండడంతో పోలింగ్ శాతం భారీగా తగ్గనుంది. దీనికితోడు ఎండతీవ్రత సైతం పోలింగ్‌పై ప్రభావం చూపనుంది. తెలంగాణలో కూడా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ పొడగించాలని రాజకీయ పార్టీల నేతలు,ఎన్జీవోలు, ఓటర్లు కోరారు.

ఇవాళ నాలుగో విడత ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఇవాళ్టి నుండే నామినేషన్లు స్వీకరించనుండగా ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ.ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన ఉండనుండగా ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది. ఇక మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

Also Read:హార్రర్ మిస్టరీ నేపథ్యంలో #BSS11

- Advertisement -