తెలంగాణలో ముందస్తు హడావిడి!

132
telangana
- Advertisement -

రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాల నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ బండి సంజయ్ పాదయాత్ర పేరుతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్ రచ్చబండ పేరుతో రైతు డిక్లరేషన్‌ను ప్రజలకు వివరిస్తున్నారు.

ఇక టీఆర్ఎస్ సైతం మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. గత ఎన్నికల్లో 86 స్థానాలు గెలుచుకున్న టీఆర్ఎస్ ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని తన బలాన్ని 103 కు పెంచుకుంది. ఇప్పటికే అనేక సర్వేలు చేయించిన కేసీఆర్ అభ్యర్థులు ఎంపిక పైనే ప్రధాన దృష్టి సారించినట్లు తెలుస్తుంది.

గతంలో ఎప్పుడూ లేని విధంగా కేసీఆర్ ఇప్పటి నుంచే అభ్యర్థుల జాబితా పై కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది . తన సొంత సర్వేలతో పాటు ప్రశాంత్ కిషోర్ ఇచ్చే రిపోర్టుల ఆధారంగా అభ్యర్థులు ఎంపిక జరగనున్నట్లు సమాచారం. అందుకే ఎమ్మెల్యేలు, మంత్రులు ,ఎంపీలు , ఎమ్మెల్సీలు అంతా నియోజకవర్గాలను దాటి బయటికి రావడం లేదు. ఏది ఏమైనా ఈసారి పోరు రసవత్తరంగా ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు.

- Advertisement -