ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటాలిః కోలేటి దామోదర్

380
Koleti Damodar Haritha haram
- Advertisement -

తెలంగాణ ఉద్యమంలో ఏవిధంగా అయితే కష్టపడ్డామో అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటాలన్నారు తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్. పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గోషామహల్ లోని పోలీస్ శిక్షణ కేంద్రంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గోన్నారు. ఈసందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కోలేటి దామోదర్ మాట్లాడుతూ.. పచ్చని చెట్లు నేల తల్లికి వస్త్రాలని, భూమిపై నివసించే సకల జీవులకు చెట్లే జీవనాధారమన్నారు.

koleti Damodar

చెట్లను పెంచడం అంటే ప్రకృతిమాత దీవెనలు పొందటమే అన్నారు. ఇప్పుడు మనం చెట్లను పెంచడం అశ్రద్ధ చేస్తే ముందు ముందు తరాలు మనల్ని క్షమించవని చెప్పారు. చెట్లను నాటడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. పోలీస్ శాఖ క్రమశిక్షణకు మారుపేరని, పోలీస్ శాఖకు వందల వేల ఎకరాల భూములు ఉన్నాయని ..ఈసందర్భంగా పోలీస్ సిబ్బంది అందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ భూముల్లో మొక్కలు నాటాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ పో లీస్ కమీషనర్ శ్రీ టి. మురళికృష్ణ, ఐ.పి.ఎస్., జాయంట్ పో లీస్ కమీషనర్ వెస్ట్ జోన్ శ్రీ ఎ.ఆర్. శ్రీనివాస్, ఐ.పి.ఎస్., సెంట్రల్ జోన్ జాయింట్ కమీషనర్ శ్రీ విశ్వ ప్రసాద్, ఐపిఎస్, పోలీస్ శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ శ్రీ మిర్జా రియాజ్ బేగ్ తదితర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గోన్నారు.

- Advertisement -