ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి షాకిచ్చారు గచ్చిబౌలి పోలీసులు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో గాంధీతో పాటు అతని సోదరుడు, కుమారుడుపైన హత్యాయత్నం కేసు నమోదు చేశారు.అలాగే కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ తో పాటు మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్ లను పోలీసులు నిందితులుగా చేర్చారు.
కౌశిక్ ఇంటి వద్ద ఘటనపై ఎస్ఐ మహేశ్ ఇచ్చిన ఫిర్యాదుతో రెండ్రోజుల క్రితమే గాంధీపై కేసు నమోదైంది. ఈ కేసులో ఎమ్మెల్యే గాంధీ బెయిల్ తీసుకున్నారు. తాజాగా కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అరెకపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఎలా ఇస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. గాంధీ మాత్రం తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నానని తెలిపారు.
Also Read:Supreme Court: కేజ్రీవాల్‌కు బెయిల్…కండీషన్స్ ఇవే