Modi:విశ్వగురువా..?విష గురువా?

29
- Advertisement -

పార్లమెంట్ వేదికగా మరోసారి తెలంగాణపై విషం గక్కారు విశ్వగురువు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన సరిగా జరగలేదన్నారు. గతలో తల్లిని నుండి బిడ్డను వేరు చేసినట్లుగా తెలంగాణ విభజన ఉందని విషం గక్కారు మోడీ. ఇక తెలంగాణ సమాజమంతా కొట్లాడి సాధించుకున్న తెలంగాణ త్యాగాల పునాదులపైన ఏర్పడింది, అలాంటి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంబురాలు జరగలేదని మాట్లాడారు. వాస్తవానికి ప్రత్యేక రాష్ట్రం ప్రకటన వెలువడిన వెంటనే తెలంగాణ సమాజం అంతా రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. ఇది చరిత్ర. దీనిని తమ మాటలతో వక్రీకరించే ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం ఎప్పటికి సహించదు. .

మొదటి నుంచి తెలంగాణపై వివక్ష చూపుతూనే ఉండి మోడి సర్కార్. రాష్ట్రానికి రావలసిన నిధులను ఎగ్గొట్టడం, ఇచ్చిన హామీలను పక్కన పెట్టేయడం, అసలు తెలంగాణతో మాకు సంబంధమే లేదు అన్నట్లుగా వ్యవహరించడం.. అదేంటి అని కేంద్రాన్ని తెలంగాణ సర్కార్ ప్రశించినప్పుడు సమాధానం చెప్పకుండా దాటవేయడం… ఇది తెలంగాణపై బీజేపీ సర్కార్ వైఖరి. ఇతర రాష్ట్రాలకేమో మెండుగా నిధులను విడుదల చేస్తూ తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపిస్తోంది.

Also Read:KTR:తెలంగాణపై విషం చిమ్ముతున్న మోడీ

ఒక వైపు బీజేపీ పాలిత రాష్ట్రాలకు సకాలం విడుదల, అన్నీ విధాలుగా కేంద్ర సహకారం అండదండలు.. అబ్బో ఒక్కటేంటి బీజేపీ పాలిత రాష్ట్రాలపై కేంద్రం కురిపిస్తున్న ప్రేమ అంతా ఇంతా కాదు. మరి అదే ప్రేమ తెలంగాణ వంటి బీజేపీ రహిత రాష్ట్రాలపై ఎందుకు చూపించడం లేదంటే కమలనాథుల వద్ద సమాధానం లేని పరిస్థితి. ఏపీ పునః విభజన చట్టంలో భాగంగా ట్రైబల్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని నరేంధ్ర మోడీ హామీ ఇచ్చారు. ఆ తర్వాత హామీల ప్రస్తావనే లేదు.

ఇక బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ.. అబ్బో ఇలా తెలగాణపై కురిపించిన వరాలు అన్నీ ఇన్ని కావు. కానీ వీటిలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు మోడీ సర్కార్. అటుంచితే గుజరాత్ కు 21 వేల కోట్లరూపాయలతో కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభించారు. మరి తెలంగాణలో ఎందుకు ప్రారంభించడంలేదు. గుజరాత్ రాష్ట్రనికి ఒక న్యాయం ? తెలంగాణ కు ఒక న్యామయా ? అని తెలంగాణ ప్రజలు సంధించే ప్రశ్నలకు రాష్ట్ర బీజేపీ నేతల వద్ద గాని కేంద్రం వద్ద గాని సమాధానం లేదు. ఈ రకంగా చూస్తే తెలంగాణ ప్రజలకు మోడీ సర్కార్ తప్పక క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైన ఉంది.

Also Read:KTR:తెలంగాణపై విషం చిమ్ముతున్న మోడీ

- Advertisement -