Sunday, December 29, 2024
Home టాప్ స్టోరీస్ Pawan:పవన్ ను ‘ డోంట్ కేర్ ‘ అంటున్న ప్రజలు!

Pawan:పవన్ ను ‘ డోంట్ కేర్ ‘ అంటున్న ప్రజలు!

61
- Advertisement -

తెలంగాణలో పవన్ ను ప్రజలు తిరస్కరిస్తున్నారా ? అందుకే ఆయన కాన్వాయ్ పై చెప్పుల దాడి జరిగిందా ? పవన్ ను తెలంగాణ ప్రజలు అవకాశవాది గానే చూస్తున్నారా ? అంటే అవుననే అంటున్నారు కొందరు రాజకీయ వాదులు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన ఫోకస్ అంతా కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ పైనే పెడుతూ వచ్చారు. ఏపీలో అధికారమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తూ వచ్చారు. అయితే తెలంగాణ విషయంలో 2014, 2018 ఎన్నికలను లైట్ తీసుకున్న పవన్ ఈసారి మాత్రం తెలంగాణలో కూడా పోటీ చేస్తున్నారు. అది కూడా బీజేపీతో జట్టు కట్టి తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచారు. .

అయితే తెలంగాణ ప్రజలు పవన్ ను తిరస్కరిస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన వ్యవహరించే తీరు, తీసుకునే అస్థిర నిర్ణయాల కారణంగా పవన్ పార్ట్ టైమ్ పొలిటీషియన్ అనే ముద్ర గట్టిగా పడింది. అంతేకాకుండా తన ప్రయోజనాల నిమిత్తం ఒక పార్టీతో జట్టు కట్టడం మరో పార్టీతో అంతర్గత పొత్తు పెట్టుకోవడం వంటివి చేస్తుండడంతో పవన్ ఏపీ ప్రజలు లైట్ తీసుకుంటూ వచ్చారు.

ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా పవన్ విషయంలో ఇదే వైఖరి ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేయబోతున్న పవన్ కు ప్రచారల్లో భాగంగా ఇటీవల ఆయన కాన్వాయ్ పై ప్రజలు చెప్పులు విసిరారు. దీంతో పవన్ ను తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తున్నారని రాజకీయ వాదులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ సింగిల్ గా తన రాజకీయ పార్టీని కొనసాగిస్తూ వుంటే ప్రజల మన్ననలు పొందేవారని అలా కాకుండా నిత్యం ఏదో ఒక పార్టీతో జట్టు కడుతూ ఇతర పార్టీల పల్లకి మొసేందుకే పవన్ ప్రయత్నిస్తుండడంతో ఆయన రాజకీయాలకు పనికిరాడనే వాదన కూడా బలంగా పెరుగుతూ వస్తోంది. మరి తెలంగాణలో పవన్ పైనే ఆధార పడ్డ బీజేపీకి కూడా ఆయన కారణంగా ముప్పు తప్పేలా లేదు.

- Advertisement -