సీఎం కేసీఆర్ వెంటే తెలంగాణ ప్రజలు : మంత్రి కొప్పుల

177
Minister Koppula
- Advertisement -

ఇటీవల రెండు శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలలో, తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితంతో తెలంగాణ సమాజం కేసీఆర్, టీఆర్ఎస్ వెంటే ఉన్నట్లు స్పష్టమయిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ ఎన్నికల సరళిని విశ్లేషిస్తే కాంగ్రెస్, బీజేపీలు టీఅర్ఎస్‌కు అసలు పోటీ కాదు, కాలేదని తేటతెల్లం అయిందన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆరే తమ నాయకుడు అని, వారి నాయకత్వం మీదనే తమ నమ్మకం అని నిరూపించారు. సాగర్ ఎన్నికలలో టీఆర్ఎస్ పక్షాన నిలిచిన ఓటర్లందరికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -