గవర్నర్.. బీజేపీ చేతిలో కీలుబొమ్మా?

14
- Advertisement -

పార్టీలకు అతీతంగా ఉండాల్సిన అత్యున్నత పదవులలో గవర్నర్ పదవి కూడా ఒకటి. ఇంతటి అత్యున్నత పదవిలో ఉన్నవారు అన్నీ పార్టీలపై సమాన వైఖరిని కనబరుస్తూ ప్రజస్వామ్యంలో నిబద్దత కలిగి ఉండాల్సిన అవసరత ఉంది. కానీ తెలంగాణ గవర్నర్ తమిళ్ సై మాత్రం పై విధానాలు కొంత భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన వైఖరిని ప్రదర్శిస్తూ ఉంటారు. కేంద్రంలో మోడి సర్కార్ వైఫల్యాలను ప్రశ్నించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ ఎప్పటికప్పుడు చోరువ చూపిస్తూనే ఉంటారు. అందుకే కే‌సి‌ఆర్ పై బీజేపీ సర్కార్ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటుంది. దాంతో బీజేపీ కాంపౌండ్ నుంచే వచ్చిన గవర్నర్ తమిళ్ సై కూడా సి‌ఎం కే‌సి‌ఆర్ పై ఎప్పటికప్పుడు వ్యతిరేకత చూపుతూ అబాసుపాలు అవుతుంటారు.

ఇక తాజాగా మరోసారి కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారు గవర్నర్ తమిళ్ సై. గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలు చేయాలనే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ వద్ద ఉంచగా ప్రభుత్వ ప్రతిపాదనను గవర్నర్ తమిళ్ సై తిరస్కరించారు. అయితే ఈ తిరస్కరణ ఆమె పార్టీ పరంగా చేసిందా గవర్నర్ హోదాలో చేసిందా అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గతంలో ఆమె తమిళనాడు బీజేపీకి అధ్యక్షురాలిగా పని చేశారు. అందుకే తెలంగాణలో ప్రతిసారి బి‌ఆర్‌ఎస్ సర్కార్ కు అపోజిట్ గా ఆమె నిర్ణయాలను తీసుకుంటూ వస్తున్నారు. ఇలా ఒక అత్యున్నత పదవిలో ఉంటూ ఒకే కక్షపూరితంగా వ్యవహరించడం ఏంటని రాజకీయ అతివాదులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి గవర్నర్ వ్యవహార శైలి చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల చేతిలో కీలు బొమ్మగా ఉందా అనే అనుమానాలు రాక మానవు.

Also Read:ఆమె అందాలకు ఎంతైనా ఇవ్వొచ్చు అట!

- Advertisement -