కేంద్ర హోం శాఖకు పంచాయతీ ఆర్డినెన్స్

7
- Advertisement -

కేంద్ర హోం శాఖకు తెలంగాణ పంచాయతీ ఆర్డినెన్స్ చేరింది. న్యాయ సలహా కోసం సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ కి ఆర్డినెన్స్ పంపారు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. ఆర్డినెన్సు పై తెలంగాణ ఏజీతో చర్చల అనంతరం కేంద్ర హోంశాఖ కు ఆర్డినెన్స్ ను పంపారు గవర్నర్.

తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285ఏ ప్రకారం గ్రామ పంచాయతీ, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజా పరిషత్‌లలో రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలను వరిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం సుప్రీం కోర్టు తీర్పులను అనుసరించి, షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ),షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ) , బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు.

Also Read:నీట్ విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు

అయితే కులగణన సర్వేలోని ఎంపిరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు ఉంటాయి అని ఇటీవల ప్రభుత్వం మార్చి ఆ ముసాయిదాను గవర్నర్‌కు పంపింది. దీనిపై లీగల్ ఓపినియన్ తీసుకుని కేంద్ర హోంశాఖకు పంపారు గవర్నర్.

- Advertisement -