పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించిన TRS ఎన్నారై శాఖలు..

301
KTR
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నలభై దేశాలలోని టిఆర్ఎస్ ఎన్నారై శాఖలు పార్టీ సభ్యత్వ నమోదు కాంపెయిన్ ఈ రోజు నుండి మొదలు పెట్టాయి. సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని కేటీర్ టిఆర్ఎస్ ఎన్నారై శాఖలకు సూచించారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల కేటీర్ చేతుల మీదుగా సభ్యత్వం తీసుకున్నారు.

ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ.. ౩౩ జిల్లాలో పార్టీ కార్యాలయాలను స్థాపిస్తునందుకు ఎన్నారైలందురు హర్షం ప్రకటించారని ఆయన తెలిపారు.పార్టీ రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో 40 దేశాలలోని ఎన్నారై శాఖలు తమవంతు సహాయాన్ని చేశాయన్నారు. ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కోటి మంది పైగా సభ్యత్వ నమోదుకు పిలుపు మేరకు ఎన్నారై శాఖలు కూడా తమ వంతు కార్యాచరణ మొదలు పెట్టాయన్నారు.రానున్న రోజుల్లో టిఆర్ఎస్ ఎన్నారై సలహాదారు మాజీ ఎంపీ కవిత ఆధ్వర్యంలో వంద వరకు టిఆర్ఎస్ ఎన్నారై శాఖలను విస్తరిస్తామన్నారు.

- Advertisement -