తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం అయిందని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా చేపల పెంపకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తలసాని..మత్స్యకారులకు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌ను అమలు చేస్తున్నామని చెప్పారు.
సమైక్య ఆంధ్రలో మత్స్యకారులను పట్టించుకోలేదు. గత ప్రభుత్వాలు మత్స్యకారులను మరిచిపోయాయి. కానీ తెలంగాణ రాష్ట్రం మత్య్సకారులను ఆదుకునేందుకు ముందుకొచ్చిందన్నారు. మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ చేపట్టామన్నారు. చేపల ఎగుమతిలో నంబర్‌వన్ స్థానంలో ఉన్నామని తెలిపారు.
రాష్ట్రంలో భారీ ఎత్తున చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని…చేపల ఉత్పత్తిని పెంచడానికి, మత్స్యకారుల జీవనోపాధిని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చేపలను, రొయ్యలను భారీ ఎత్తున పెంచుతున్నామని తెలిపారు.