రేషన్ కార్డు లబ్దిదారులకు గుడ్ న్యూస్..

18
kcr cm

మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ముఖ్యంగా రేషన్ కార్డుల కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది. దీంతో పెండింగ్‌లో ఉన్న 4,46,169 మంది అర్హులకు రేషన్ కార్డులు అందనున్నాయి.15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది.

అలాగే ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌తో పెరిగిన జీతాలు ఈ నెల నుంచే అందనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది,పెన్షనర్లు కలిపి మొత్తం 9,21,037 మందికి పీఆర్సీ ప్రకటిస్తూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనకు మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది.