ఈనెల ఆఖరులోగా మంత్రివర్గ విస్తరణ

234
cm kcr
- Advertisement -

తెలంగాణలో ఈనెల చివరి వరకూ పూర్తి స్ధాయిలో మంత్రి వర్గ విస్తరణ జరుగనుందని సమాచారం. మే 23 న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రానున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ ఫలితాల వచ్చిన మూడు లేదా నాలుగు రోజుల్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తుంది. జూన్ 2న రాష్ట్ర అవతర దినోత్సవం కనుక ఆ లోపు ఎప్పుడైనా జరగవచ్చని పార్టీ వర్గాల సమాచారం. టీఆర్ఎస్ రెండో సారి తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ తో పాటు హోం మంత్రి మహ్మద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరి 18న మరో 10మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేపించారు.

ఇక చివరగా ఆరు మంత్రి పదవులు మిగలడంతో ఎవరికి వరిస్తాయో అని ఆసక్తి నెలకొంది. నల్లగొండ నుంచి సీనియర్ నేత మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఖాయం అని వినిపిస్తుంది. ఎందుకంటే సీఎం కేసీఆర్ ఇటివలే ఆయన్ను ఎమ్మెల్సీగా కూడా ఎంపీక చేశారు. నల్లగొండ బహిరంగ సభలో కూడా కేసీఆర్ గుత్తాకు హామి ఇచ్చారు. ఇక మరో వైపు కేటీఆర్, హరీష్‌ రావులకు కూడా రెండవ విడదతలో ఛాన్స్ దక్కనుందని తెలుస్తుంది. ఉమ్మడి కరీంనగర్ నుంచి ఈటెల రాజేందర్, కొప్పులు ఈశ్వర్ ఉన్నారు. ఇక మరో రెండు పదవులు మహిళలకు ఇవ్వనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్.

అందులో ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డి, గొంగిడి సునీత లో ఎవరికో ఒకరికి దక్కనుంది. ఇక ఎస్టీ కోటాలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ లేదా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ లకు అవకాశం దక్కనుంది. ప్రస్తుతం ఉన్న మంత్రి పదవుల్లో కుల సమీకరణాలను బట్టి చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు 5గురు, బీసీలు 3, ఎస్సీలు 1, మైనారిటీలు1 ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రి పదవుల్లో ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరూ కూడా లేరు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కు మంత్రి పదవి దక్కనున్నట్లు తెలుస్తుంది. మే 23తర్వాత మంత్రి పదవులపై క్లారీటి వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -