సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన కొత్త సీఎస్‌..

407
cm
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్ ను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ సంద్భంగా సీఎస్‌గా నియమితులైన సోమేశ్‌కుమార్‌ సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్‌కే జోషి పదవీ విరమణతో సోమేశ్‌కుమార్‌ను ప్రభుత్వం రాష్ట్ర నూతన సీఎస్‌గా నియమించింది. తన నియామకం పట్ల సోమేశ్‌కుమార్‌ సంతోషం వ్యక్తం చేస్తూ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

సీఎస్‌గా సోమేశ్‌కుమార్‌ 31 డిసెంబర్‌, 2023 వరకు కొనసాగనున్నారు. కాగా ఈ రోజు రిటైర్ కాబోతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. నీటి పారుదల వ్యవహారాల సలహదారుడిగా ఎస్.కె.జోషి వ్యవహరించనున్నారు.

- Advertisement -